పవిత్రతకూ, అదికారానికీ, అందానికీ చిహ్నంగా శ్రీకృష్ణుడు తన శిరస్సు పై నెమలిఫించాన్ని ధరిస్తాడు. అదెలా అంటే – శ్రీకృష్ణుడు బాహ్య ప్రపంచానికి రాసలీలా మానసచోరుడే అయినా నిజానికి సాక్షాత్తూ శ్రీమహవిష్ణువు అవతారం. సృష్టిలో ఊ మలినమూ అంటని, సంభోగించని ప్రాని ఒక్క నెమలి మాత్రమే. ఎందుకంటే మగనెమలి ఆకాశంలో మబ్బులు పట్టి, ఉరుములు ఉరుముతున్న సమయంలో గానీ లేదా ఆడనెమలి మీద మనసు పడినప్పుడు గానీ పురి విప్పి ఆనందంగా నాట్యం చేస్తుంది. అలా నాట్యం చేసినపుడు మగనెమలి కంట్లోంచి నీరులాంటి ద్రవము పైకి ఉబుకుతుంది. ఆడనెమలి దానిని మింగడం వలన గర్బం ధరిస్తుది. దీనిని ‘‘ నేత్రరతి’’ అంటారు ఈ విధంగా గర్భాన్ని ధరించే ప్రాణి సృష్టిలో వేరొకటిలేదు. అంతటి పవిత్రమైన నెమలిఫించాన్ని ధరించే శ్రీకృష్ణుడు ఎంతటి పవిత్రడో తెలియజెప్పడానికి, సర్వలోకాలకీ అధిపతి అయిన మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అధికారాన్నీ, ఆ బాలగోపాలన్నీ సమ్మోహన పరచే శ్రీ కృష్ణుని అందాననీ తెలియ జెప్పేందుకే ఈ మూడింటికీ చిహ్నమైన నెమలి ఫించాన్ని శ్రీకృష్ణుడు ధరిస్తాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: